News March 16, 2025
భువనగిరి: గ్రేట్.. మూడు జాబ్స్ కొట్టాడు

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం రావడమే గగనం. అలాంటిది ఏకంగా 3 ఉద్యోగాలను కొల్లగొట్టి ఔరా అనిపించాడు భువనగిరి మండలం గౌస్ నగర్ గ్రామానికి చెందిన అజయ్ కుమార్ రెడ్డి. గ్రూప్-2లో 713, గ్రూప్-3లో 451వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్-4లో 336వ ర్యాంక్ సాధించి ఇప్పటికే కలెక్టర్ ఆఫీస్‌లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. దీంతో అజయ్‌కు తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
Similar News
News March 5, 2026
పార్వతీపురం: ‘యుద్ధప్రాతిపదికన డోలీ రోడ్లు పూర్తి చేయాలి’

పార్వతీపురం మన్యం జిల్లాలో పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా చేపడుతున్న డోలీ రోడ్లన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో గురువారం కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. పనుల్లో నిర్లిప్తత పనికిరాదని, అలాగే నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యత, పారదర్శకతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
News March 5, 2026
ప.గో: రూ. 3 కోట్ల విలువైన బంగారంతో వ్యాపారి పరారీ

ఆభరణాలు తయారు చేస్తానని నమ్మించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సిసిర్ బేగ్ తణుకులో పలువురు మహిళల నుంచి సేకరించిన సుమారు రూ. 3 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించాడు. జనవరి 9 నుంచి అతడు కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేశారని, ఇప్పుడు నిందితుడు ఐపీ నోటీసులు పంపాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
News March 5, 2026
భూపాలపల్లి: అడ్వాన్స్‌గా మూడు నెలల రేషన్

ఆహార భద్రత కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు నెలల రేషన్ కోట పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్, మే, జూన్ రేషన్ సరకులు లబ్ధిదారులకు అడ్వాన్స్ గానే పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 277 రేషన్ దుకాణాలు, 1,38,234 కార్డు దారులకు 2,117 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతి నెల పంపిణీ చేస్తున్నారు. అడ్వాన్సురేషన్ రానుండటంతో ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.


