News March 16, 2025
ములుగు జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

ములుగు జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం ఇంకా వీడలేదు. కొంతమంది చేపలు, మటన్ వైపు మొగ్గు చూపుతుంటే, చికెన్ కొనుగోలు చేసి తింటున్నారు. జిల్లాలో చికెన్ ధరల్లో ప్రాంతాన్ని బట్టి మార్పులు ఇలా ఉన్నాయి. కేజీ చికెన్ రూ.220 ఉండగా.. స్కిన్లెస్ రూ. 240గా ఉంది. హోల్సేల్ రూ.80-90 ఉండగా, రిటైల్ 130 వరకు ధర పలుకుతుంది. ఈ చికెన్ ధరల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మార్పులు సైతం ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.
Similar News
News March 20, 2026
TODAY HEADLINES

☛ ఏపీలో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల
☛ ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు: CM CBN
☛ రైతును రాజును చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్
☛ తెలంగాణలో ఘనంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరైన సీఎం రేవంత్, చిరంజీవి, కమల్ తదితరులు
☛ కవిత రాజకీయ పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’
☛ కొత్త శక్తికి, ఆరంభానికి ప్రతీక ఉగాది: మోదీ
☛ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
News March 20, 2026
కేరళంపై కమలం గురి – 1/2

కేరళంలో పాగా వేయాలని ఈసారి ప్రధాన కూటములు LDF, UDFతో పాటు BJP కూడా శ్రమిస్తోంది. పెరుగుతున్న ఓట్ షేర్‌ను సీట్లుగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10.57%గా ఉన్న BJP షేర్ 2021లో 11.30%కు పెరిగింది. అప్పుడు NDAకి 2.55% తగ్గి 12.41% వచ్చినా వ్యక్తిగతంగా BJPకి ప్లసే అయింది. 2024 LS పోల్స్‌లో NDAకి 19.24% వచ్చింది. ఇందులో ఒక్క బీజేపీకే 16.68% (3.68%+) వచ్చింది. <<-se>>#Elections2026<<>>
News March 20, 2026
కేరళంపై కమలం గురి – 2/2

ఇక తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో విక్టరీతో బీజేపీకి బూస్ట్ దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాసర్‌గోడ్, పాలక్కడ్, నెమోమ్ సహా 9 స్థానాల్లో BJP రన్నరప్‌గా నిలిచింది. ఈసారి పార్టీ వీటిపై దృష్టి పెడితే కేరళంలో పాగా ఈజీ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్‌ను తిప్పుకోవాలన్న ప్రయత్నాలు సక్సస్ అయితే కేరళంలో ఈసారి బీజేపీ ఇంపాక్ట్ కనిపిస్తుందని అంటున్నారు. <<-se>>#Elections2026<<>>


