News March 16, 2025
అమరావతి కోసం రూ.11వేల కోట్లు.. నేడు ఒప్పందం

AP: నేడు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో), సీఆర్డీఏ మధ్య ఒప్పందం కుదరనుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 22న హడ్కో రూ.11వేల కోట్ల రుణం మంజూరు చేసింది. నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదరనుంది. అగ్రిమెంట్ అయ్యాక హడ్కో నిధులను విడుదల చేయనుంది.
Similar News
News March 16, 2025
భద్రత పెంపుపై సీఎం ఆలోచించాలి: డీకే అరుణ

TG: తన ఇంట్లోకి <<15780375>>ఆగంతకుడు<<>> ఎందుకు ప్రవేశించాడో తెలియలేదని ఎంపీ డీకే అరుణ చెప్పారు. హాల్, కిచెన్, బెడ్ రూమ్‌లో సెర్చ్ చేశాడని, ఎలాంటి వస్తువులు దొంగిలించలేదని వెల్లడించారు. తన భర్తకు ఇప్పటివరకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేదన్నారు. గతంలో తన నాన్నపై దాడి జరిగిందని, భద్రత పెంపుపై సీఎం రేవంత్ ఆలోచించాలని కోరారు. ఈ ఘటనతో తన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
News March 16, 2025
బంగారం ధర తగ్గే అవకాశం ఉందా?

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ధరలు తగ్గుతాయనే విషయమై నిపుణులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ అనూహ్య నిర్ణయాలు, ఇతర ప్రతికూల పరిస్థితులు ఇలాగే కొనసాగితే తగ్గకపోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం 3వేల డాలర్లు ఉన్న ఔన్సు ధర 3,040 డాలర్లకు చేరాక అక్కడి నుంచి తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై 1-2 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
News March 16, 2025
కోహ్లీ.. ఆ ఒక్క సెంచరీ చేస్తే

భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. ఐపీఎల్‌లో మరో సెంచరీ చేస్తే టీ20 ఫార్మాట్‌లో 10 శతకాలు చేసిన తొలి భారత ప్లేయర్‌గా నిలవనున్నారు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ(8) ఉన్నారు. కోహ్లీ IPLలోనే 8 సెంచరీలు, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక సెంచరీ చేశారు. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో గేల్(22), బాబర్(11) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.