News March 16, 2025

సూర్యాపేట: రేపు ఎస్సారెస్పీ నీటి విడుదల

image

సూర్యాపేట జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ఆయా కట్టుకు ఈనెల 17వ తేదీ నుంచి ఆరు తడి కింద 8 రోజులపాటు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ ఎస్ఈ శివ ధర్మ తేజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, చివరి భూములకు నీరు అందేలా సహకరించాలని సూచించారు.

Similar News

News March 22, 2026

ఆదిలాబాద్: మూడు నెలల రేషన్ ఒకేసారి

image

పెరుగుతున్న ఎండల దృష్ట్యా రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనుంది. నిర్మల్ జిల్లాలో 2.18 లక్షల మందికి, ఆదిలాబాద్‌లో 2.05 లక్షల కార్డుదారులకు ఈ వెసులుబాటు కలగనుంది. నిజామాబాద్ నుంచి బియ్యం సరఫరా వేగవంతమైంది. దీనివల్ల లబ్ధిదారులు ప్రతి నెలా ఎండలో వరుస కట్టాల్సిన అవస్థలు తప్పుతాయి.

News March 22, 2026

కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

image

పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లో ఖతర్‌కు చెందిన మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో వ్యక్తి గల్లంతయ్యాడని అధికారులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసేందుకు, మిస్సింగ్ పర్సన్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని పేర్కొన్నారు.

News March 22, 2026

జమ్మలమడుగు యువకుడికి ఆల్ ఇండియా ర్యాంక్

image

జమ్మలమడుగు (M) ఎస్. ఉప్పలపాడు గ్రామానికి చెందిన తలారి మోహన్ గేట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో మెకానికల్ ఇంజినీరింగ్ (ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్) విభాగంలో ఆల్ ఇండియా 89వ ర్యాంక్ సాధించి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మోహన్ తల్లిదండ్రులు సంజీవరాయుడు, లక్ష్మీదేవి, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.