News March 16, 2025
HYD: శ్రీరాములు పేరిట తెలుగు విశ్వవిద్యాలయం

తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును HYDలోని తెలుగు విశ్వవిద్యాలయానికి నామకరణం చేశారు. 1985లో DEC 2న నాటి CM NTR ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత దీనికి 1998లో అమరజీవి పేరు పెట్టారు. కూచిపూడిలోని సిద్దేంద్ర కళాక్షేత్రాన్ని విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు. తెలుగు ప్రజల కోసం ఆత్మబలిదానం చేసిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం.
Similar News
News October 15, 2025
శ్రీశైలంలో హైఅలర్ట్.. రాకపోకలపై ఆంక్షలు

AP: రేపు <<17979325>>PM మోదీ<<>> శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. 1800మంది పోలీసులు, సిబ్బందితో మూడంచెల భద్రతా వలయం ఏర్పాటు చేశారు. రేపు ఉ.9 గంటల నుంచి మ.2 గంటల వరకు వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. భక్తులు దీనికి తగిన విధంగా తమ ప్లాన్స్ మార్చుకోవాలని జిల్లా కలెక్టర్, SP సూచించారు.
News October 15, 2025
ఓయూ రిజిస్ట్రార్‌కు ‘బెస్ట్ రీసెర్చ్ పేపర్’ అవార్డు

ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డికి ‘బెస్ట్ రీసెర్చ్ పేపర్’ అవార్డు లభించింది. ద ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్(ఐఏఏ) నిర్వహించిన 47వ ఆల్ ఇండియా అకౌంటింగ్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జనార్దన్ రాయ్ నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్(డీమ్డ్ యూనివర్సిటీ)లో ఈనెల 12, 13 తేదీల్లో ఈ సదస్సు జరిగింది.
News October 15, 2025
తిరుమల నుంచి 187 మంది తరలింపు

తిరుమలలో యాచకులు, అనాధికారిక హాకర్ల పై టీటీడీ విజిలెన్స్, పోలీస్ శాఖ మూడు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో 187 మందిని గుర్తించి తిరుమల నుంచి కిందకి తరలించారు. వివిధ ప్రాంతాలను భక్తుల కోసం శుభ్రపరిచారు. హోటల్స్, టీ షాపులు వద్ద పారిశుద్ధ్యం పై సూచనలు చేశారు.