News March 16, 2025

పెద్దపల్లి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా

image

పెద్దపల్లి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.200-240 ఉండగా విత్ స్కిన్ కేజీ రూ.170-180 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ.150-160 మధ్య ఉంది. ఇక బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గతనెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా ప్రస్తుతం అమ్మకాలు పెరిగాయని ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. 

Similar News

News January 17, 2026

వరంగల్: సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక సేవలు

image

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు వివిధ కారణాలతో మేడారం వెళ్లలేని భక్తులకు ఇంటివద్దకు బంగారం(బెల్లం) ప్రసాదాన్ని చేర్చేందుకు లాజిస్టిక్ ప్రణాళికలు సిద్ధం చేసింది. దేవాదాయ సహకారంతో ప్రసాదం అందజేస్తుంది. దీనికి రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 040-69440069 సంప్రదించవచ్చు.

News January 17, 2026

వరంగల్: భారీ వర్షాల నష్టంపై కేంద్రానికి నివేదిక: గయా ప్రసాద్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు, ఆస్తి, మౌలిక వసతులకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ గయా ప్రసాద్ తెలిపారు.అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో రెండు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

News January 17, 2026

ఎడమవైపు తిరిగి పడుకుంటే..

image

ఎడమవైపు తిరిగి పడుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు. గ్రావిటీ వల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. శరీరానికి రక్త సరఫరా మెరుగుపడి గుండెపై భారం తగ్గుతుంది. గర్భంతో ఉన్న మహిళలు ఎడమ వైపు తిరిగి నిద్రిస్తే శిశువు భంగిమ సరిగ్గా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వెన్ను సమస్య ఉంటే ఒత్తిడి తగ్గి రిలాక్స్ అవుతారు.
Share It