News March 24, 2024

పల్నాడు జిల్లాలో రూ.1 కోటి సామగ్రి సీజ్

image

కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి పకడ్బందీగా పర్యవేక్షణ జరుగుతుందని శనివారం జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. కోడ్ ఉల్లంఘన సహితమైన 11225 (పబ్లిక్), 3938 ప్రయివేటు అంశాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రూ.17.94 లక్షల నగదు, రూ.23.31 లక్షలు విలువైన లిక్కర్, ఇతర సామగ్రి 52.65 లక్షలు, మొత్తం రూ.1.1 కోట్ల వరకు సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News September 7, 2025

గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా ఫారెస్ట్ ఆఫీసర్స్ పరీక్షలు

image

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్ల భర్తీకి గుంటూరులో ఆదివారం పరీక్షలు జరిగాయి. FBA, ABF పోస్టులకు 7,655 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 5,988 మంది హాజరయ్యారు. సెక్షన్ ఆఫీసర్ పరీక్షకు 1,492 మంది హాజరుళకావాల్సి ఉండగా.. 1,133 మంది హాజరయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి పరీక్షా కేంద్రాలతో పాటూ ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను పరిశీలించారు.

News September 7, 2025

సంగీత దర్శకుడు BNR మన కొలకలూరు వారే

image

తెలుగు సినిమా సంగీత దర్శకులు భీమవరపు నరసింహరావు (బి.ఎన్.ఆర్.) గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొలకలూరులో జన్మించారు. జనవరి 24, 1905న జన్మించిన ఆయనకు 8 ఏళ్ల వయసు నుంచే సంగీతంపై ఆసక్తి కలిగింది. ఆయన మొదటి సినిమా సతీ తులసి (1936), ఆఖరి చిత్రం అర్ధాంగి (1955). సెప్టెంబర్ 7, 1976న ఆయన మరణించారు. ఆయన తెలుగు సినిమా సంగీతానికి ఎనలేని సేవలు అందించారు.

News September 7, 2025

GNT: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీకి 31వ ర్యాంకు

image

కేంద్ర విద్యాశాఖ జాతీయ సంస్థల ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ప్రకటించిన ర్యాంకుల్లో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 31వ స్థానానికి పడిపోయింది. 2024లో 26వ ర్యాంకు సాధించిన ఈ యూనివర్సిటీ పాలకమండలి లేకపోవడం, శాస్త్రవేత్తల పోస్టుల భర్తీ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో యూనివర్సిటీ ప్రతిష్ఠకు గండి పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.