News March 16, 2025

ఆదిలాబాద్‌లో AIRPORT.. AI PHOTO

image

ADBలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ఉమ్మడి జిల్లా ప్రజల కల. ఆ కలను నెరవేర్చే బాధ్యత తనదని CM రేవంత్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో హామీ ఇచ్చారు. వరంగల్ తర్వాత ADBకే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటైతే ఉమ్మడిజిల్లా ప్రజలకు మేలు చేకూరనుంది. ఎయిపోర్ట్ ఏర్పాటైతే ఎలా ఉంటుందనే AI ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News March 16, 2025

నరసరావుపేట: రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య

image

నరసరావుపేట టిడ్కో గృహాల సమీపంలోని రైలు పట్టాల వద్ద డోన్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు నాయక్ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మృతురాలు నీలం రంగు డిజైన్ చీర, నీలం రంగు జాకెట్టు ధరించినట్లు చెప్పారు. మృతురాలిని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు స్థానిక రైల్వే పోలీసులను 9440438256 సంప్రదించాలన్నారు.

News March 16, 2025

రాయచోటి: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 17న సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో తెలిపారు. రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రానికి రావాలన్నారు.

News March 16, 2025

ఇష్టం లేని కోర్సులో విద్యార్థిని.. భరోసా ఇచ్చిన కేంద్రమంత్రి

image

తల్లిదండ్రుల ఒత్తిడితో ఇష్టమైన సైన్స్ కోర్సులో కాకుండా ఆర్ట్స్‌లో చేరినట్లు బిహార్‌కు చెందిన ఖుష్భూ ఓ ఇంటర్వ్యూలో కన్నీరుమున్నీరయ్యారు. ఇది కాస్త కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి చేరడంతో ఆమెకు కాల్ చేసి ధైర్యం చెప్పారు. సైన్స్ కోర్సులో చేరమని, డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకోవాలని తెలిపారు. కాగా టెన్త్ పరీక్షల్లో 500కు 399 మార్కులు రాగా పేదిరికం వల్ల ఆమె పేరెంట్స్ ఆర్ట్స్‌లో చేర్పించారు.

error: Content is protected !!