News March 16, 2025
టెస్లా కోసం ప్రభుత్వం ప్రయత్నాలు.. భూముల పరిశీలన

AP: అమెరికాకు చెందిన ఆటోమోటివ్ కంపెనీ టెస్లాను రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి జిల్లా మేనకూరు, సత్యవేడులోని శ్రీసిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలో భూములను పరిశీలిస్తున్నారు. ఈ మూడు ప్రాంతాలు చెన్నైకి 120 కి.మీ దూరంలో ఉండటం, విమానాశ్రయాలు, పోర్టులు, నేషనల్ హైవేలు దగ్గరగా ఉండటం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Similar News
News March 16, 2025
ఈ నెల 18న ఢిల్లీకి చంద్రబాబు!

AP: ఈ నెల 18న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమరావతి పనుల పునఃప్రారంభానికి రావాలని ఆయనను ఆహ్వానించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ఇతర అంశాలపై ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
News March 16, 2025
గోద్రా అల్లర్లపై అది తప్పుడు ప్రచారం: మోదీ

గుజరాత్ గోద్రా అల్లర్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అల్లర్లుగా పేర్కొనడం అనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్‌లో పెద్ద అల్లరి జరగలేదని, ఆ రాష్ట్రం శాంతియుతంగా ఉందని చెప్పారు. ఆ సమయంలో కేంద్రంలో తమ ప్రత్యర్థులు అధికారంలో ఉండటంతో తమపై వచ్చిన ఆరోపణలను నిలబెట్టాలని చూశారన్నారు. అయితే న్యాయవ్యవస్థ తమను నిర్దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు.
News March 16, 2025
నాన్ వెజ్ ఎవరు తినకూడదంటే?

కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ అందరికీ మాంసాహారం సరిపడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులు ఎక్కువగా నాన్ వెజ్ తినకూడదు. ఇందులో ఉండే కొవ్వు, కొలెస్ట్రాల్ వీరికి హానికరం. గుండె జబ్బులు, షుగర్ ఉన్నవారు కూడా ఇది తినకపోవడమే బెటర్. ఇందులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది. అలర్జీ, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం ఉన్నవారు నాన్ వెజ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు.