News March 16, 2025
పెద్దపల్లి: 30న అఖిల భారత యాదవ మహాసభ

ఈనెల 30వ తేదీన అఖిల భారత యాదవ మహాసభ నిర్వహించనున్నట్లు యాదవ సంఘం నాయకులు శనివారం వెల్లడించారు. ఈ మేరకు పెద్దపల్లి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మహాసభలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పురస్కారాల కోసం ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News March 17, 2025
జోగులాంబ గద్వాల జిల్లా ముఖ్య వార్తలు

జోగులాంబ :@ధరూర్ : LOC అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల.
@ఇటిక్యాల :RTC బస్సులను నిలపాలని వినతి.
@ఉండవెల్లి : మారమునగాలలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.
@రాజోలి : యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేయాలి.
@అలంపూర్ : మటన్ షాపులకు భారీగా పెరిగిన విక్రయాలు.
@ జిల్లాలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
@అయిజ: స్నేహితుడి వైద్యానికి ఆర్థిక సహాయం అందించారు.
@గద్వాల : ప్రజా సమస్యలను పరిష్కరించండి.సిపిఎం
News March 17, 2025
IMLT20 విజేతగా ఇండియా మాస్టర్స్

IML T20 లీగ్ విజేతగా టీమ్ ఇండియా అవతరించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్‌ను ఇండియా మాస్టర్స్ 6వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 149 పరుగుల టార్గెట్‌ను భారత్ 17.1 ఓవర్లలోనే ఛేదించింది. అంబటి రాయుడు 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. ఆరంభంలో సచిన్ (25) మెరుపులు మెరిపించారు. నర్స్ రెండు వికెట్లు సాధించారు. బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు.
News March 17, 2025
అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.