News March 16, 2025

మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని వీసీలో హెచ్చరించారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీ లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంచాలని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. జిల్లాలో 4,141 మంది 71 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. వీటిలో 20 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

Similar News

News January 12, 2026

మేడారం: ఆర్టీసీ బస్సులు, వీఐపీలకు తాడ్వాయి రూట్..!

image

మేడారం వచ్చే RTC బస్సులు, వీఐపీల వాహనాలకు అధికారులు తాడ్వాయి రూట్‌ను కేటాయించారు. పస్రా వద్ద తనిఖీ అనంతరం తాడ్వాయి మీదుగా మేడారం చేరుకోవచ్చు. తిరుగు ప్రయాణంలో ఇదే రూట్‌ను అనుసరించాలి. బస్సులు, వీఐపీ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం నుంచి వచ్చే వాహనాల కోసం ఈసారి లవ్వాల-బందాల-పస్రా దారిని అందుబాటులోకి తెచ్చారు.

News January 12, 2026

ఈసారీ వన్ వే.. మేడారం చేరుకోండిలా!

image

మేడారం జాతరకు ఈసారీ వన్ వే అమలు చేస్తున్నారు. WGL మీదుగా వచ్చే ప్రైవేటు వాహనాలను పస్రా టూ నార్లాపూర్ వైపునకు మళ్లిస్తారు. మహారాష్ట్ర, కరీంనగర్, BHPL నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలను కాల్వపల్లి మీదుగా ఊరట్టం పార్కింగ్ స్థలాల వరకు అనుమతిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈదారిలోనే వెళ్లాలి. ఛత్తీస్‌గఢ్, ఖమ్మం ప్రైవేట్ వాహనాలను చిన్నబోయినపల్లి-కొండాయి నుంచి అనుమతిస్తారు. రిటర్న్ జర్నీకి ఇదే రూట్ ఫాలో కావాలి.

News January 12, 2026

వనపర్తి: ఉరేసుకుని యువకుడి సూసైడ్

image

వీపనగండ్ల మండలం బొల్లారంకు చెందిన గొల్ల నవీన్ (17) శనివారం ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుర్మయ్య, భాగ్యమ్మ దంపతులకు 3వ సంతానమైన నవీన్ పొలం పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఆత్మహత్య గల కారణాలు స్పష్టంగా తెలియలేదని, ప్రేమ విఫలం కావచ్చని కొందరు భావిస్తున్నారన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.