News March 16, 2025
రాజీవ్ యువ వికాసంపై Dy.CM భట్టి సమీక్ష

ప్రజా భవన్‌లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, కావలిసిన నిధులపై చర్చించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 18, 2025
ఖమ్మం: ఇంటి వద్దకే రాములవారి తలంబ్రాలు: ఆర్ఎం

ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేసినట్లు ఖమ్మం RM సరిరామ్ తెలిపారు. దీనికోసం ఆన్లైన్ లేదా బస్టాండ్ సెంటర్లు మరియు ఏజెంట్ కౌంటర్ లో రూ.151 చెల్లించి బుక్ చేసుకోవచ్చున్నారు. మరిన్ని వివరాలకు ఖమ్మం :9154298583, మధిర :9154298584, సత్తుపల్లి:9154298585, భద్రాచలం:9154298586 కొత్తగూడెం&ఇల్లందు:9154298585, మణుగూరు: 9154298588 నంబర్లకు సంప్రదించాలన్నారు.
News March 18, 2025
ఖమ్మం: అండర్ పాస్‌కు రైల్వే మంత్రి హామీ

ఖమ్మం నగరంలోని రైల్వే మధ్య గేటు సమస్యకు శాశ్వత పరిష్కారానికి హామీ లభించింది. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం పార్లమెంటులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. మధ్య గేటు ప్రాధాన్యత, వ్యాపార, వాణిజ్య సంబంధాలు తదితర అంశాలపై ఆయన రైల్వే మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి మధ్య గేటు వద్ద అండర్ పాస్ నిర్మాణం పై సాధ్యసాధ్యాలను పరిశీలించాలని రైల్వే ఉన్నతాధికారులకు సూచించారు.
News March 18, 2025
రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసిన ఎంపీ రవిచంద్ర

ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్‌కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్‌ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహచర ఎంపీలతో కలిసి పరామర్శించారు. పార్లమెంట్ ఆవరణలోని రాజ్యసభ చైర్మన్ ఛాంబర్లో కలిసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రజలు, దేవుని ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడం పట్ల రవిచంద్ర ఆనంద వ్యక్తం చేశారు.