News March 16, 2025
వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్‌ను కరీంనగర్ వరంగల్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు శాంతి భద్రతలకు సంబంధించి పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. గౌస్ ఆలం ఇటీవల కరీంనగర్ నూతన సీపీ బాధ్యతలు చేపట్టారు.
Similar News
News March 17, 2025
IMLT20 విజేతగా ఇండియా మాస్టర్స్

IML T20 లీగ్ విజేతగా టీమ్ ఇండియా అవతరించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్‌ను ఇండియా మాస్టర్స్ 6వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 149 పరుగుల టార్గెట్‌ను భారత్ 17.1 ఓవర్లలోనే ఛేదించింది. అంబటి రాయుడు 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. ఆరంభంలో సచిన్ (25) మెరుపులు మెరిపించారు. నర్స్ రెండు వికెట్లు సాధించారు. బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు.
News March 17, 2025
అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
News March 17, 2025
ధర్మవరం: చిగిచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం.

ధర్మవరం పట్టణంలోని మార్కెట్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న బోయ నారాయణ స్వామి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అనంతపురం నుంచి చిగిచెర్ల మీదుగా ద్విచక్ర వాహనంలో వస్తుండగా చిగిచెర్ల వద్ద మరో వాహనం ఢీకొనడంతో నారాయణ స్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నారాయణ స్వామి మృతి పట్ల కుటుంబ సభ్యులు బోరున విలపించారు.