News March 16, 2025

FRO స్క్రీనింగ్ టెస్ట్.. 70.85% హాజరు

image

AP: రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇవాళ నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసిందని APPSC ప్రకటించింది. 70.85% హాజరు నమోదైందని వెల్లడించింది. ఈ పరీక్ష కోసం 15,308 మంది దరఖాస్తు చేసుకోగా, 10,755 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపింది. 7,620 మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొంది.

Similar News

News January 12, 2026

PSLV-C62 ప్రయోగం

image

AP: ఇస్రో PSLV-C62 ప్రయోగం ప్రారంభమైంది. నిర్దేశిత సమయం ప్రకారం 10.18 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా అడ్వాన్స్‌డ్ భూపరిశీలన ఉపగ్రహం EOS-N1 సహా 8 దేశాలకు చెందిన మరో 15 చిన్న ఉపగ్రహాలను పంపారు. ఇవి పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేయనున్నాయి.

News January 12, 2026

వెనిజులాను ట్రంప్ ఏం చేయబోతున్నారు?

image

వెనిజులాను ఉద్ధరిస్తానన్న US అధ్యక్షుడు ట్రంప్ తాజాగా తానే ఆ దేశానికి యాక్టింగ్ <<18833003>>ప్రెసిడెంట్<<>> అని ప్రకటించుకున్నారు. డ్రగ్స్‌ను బూచిగా చూపించి ఆయిల్ కంపెనీలను గుప్పెట్లో పెట్టుకున్నారు. తాను చెప్పిన కంపెనీలకే చమురు సరఫరా చేయాలని హుకుం జారీ చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తన చెప్పుచేతల్లో ఉండాలన్నారు. తాజా ప్రకటనతో ట్రంప్ ఇంకెన్ని ఆంక్షలు విధిస్తారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News January 12, 2026

నేషనల్ కెమికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

image

CSIR-నేషనల్ కెమికల్ లాబోరేటరీలో 34 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ITI, BSc, డిప్లొమా, B.Lib.Sc.ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్‌టెస్ట్, రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncl-india.org