News March 24, 2024
పంట దిగుబడులపై రైతన్నల దిగాలు!

యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులకు గుబులు పట్టుకుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో నానాటికీ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ ప్రభావం బోర్లు, బావుల కింద సాగు చేసిన పంటలపై పడింది. సాగు చేసిన పంటల్లో చాలావరకు ఇప్పటికే ఎండిపోగా… మిగతావి వడబడుతున్నాయి . పెట్టుబడి వచ్చే స్థాయిలోనూ దిగుబడి సాధించే పరిస్థితి కానరావడం లేదు. వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న ఎండిపోగా రైతులకు కన్నీరే మిగులుతోంది.
Similar News
News March 2, 2026
‘PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి పాలన కార్యాచరణపై సమీక్షించారు. సోలార్ ప్యానెల్ అవసరమైన వారు www.pmsuryaghar.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 2, 2026
పరీక్షలంటే భయం వద్దు: కలెక్టర్

పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంత చిత్తంతో పరీక్షలకు సిద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మోటివేషన్ కార్యక్రమంలో మాట్లాడారు.పరీక్షల పట్ల భయం పెంచుకుంటే ఉన్న సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా, తెలిసిన విషయాలను కూడా మర్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
News March 2, 2026
ఖమ్మం: బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్

గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఖమ్మం జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మార్చి 4న జీజీహెచ్‌లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాలో 14 వేల మంది బాలికలను గుర్తించి, 7 ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు. మార్కెట్‌లో రూ.3,500 విలువ చేసే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.


