News March 16, 2025

సంక్షేమ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

image

స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి రూ.800 కోట్ల విలువ గల పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను డిజిటల్ విధానంలో ప్రారంభించారు. వారు ప్రారంభించిన వాటిలో 100 పడకల ఆసుపత్రి, స్కూల్స్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు పలు కాలువలు, బంజారా భవన్, మహిళ శక్తి బస్సులు లాంటి సంక్షేమ పతకాలున్నాయి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, పలువురు ఎమ్మెల్యేలు తదితరులున్నారు.

Similar News

News February 28, 2026

మెదక్‌లో సినిమా షూటింగ్ సందడి

image

చిన్నశంకరంపేట మం.జంగరాయి పరిసరాల్లో శివాని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘బుల్లెట్ బండి’ సాంగ్ షూటింగ్ సందడిగా జరిగింది. డైరెక్టర్ అరవింద్ దర్శకత్వంలో హీరో సంతోష్, నటులు అలీ గడ్డం, మహిపాల్, సుమిత్ర, అంజిరెడ్డి పాల్గొన్నారు. నిర్మాత శివాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చిత్రానికి మను కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రకృతి దృశ్యాల మధ్య జరుగుతున్న ఈ చిత్రీకరణను గ్రామస్థులు ఆసక్తిగా వీక్షించారు.

News February 28, 2026

హైదరాబాద్‌లో ఇక ఒకే చట్టం: సీఎం ఆదేశాలు

image

ఓఆర్ఆర్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు ఒకే చట్టం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్‌పై సీఎం సమీక్షించారు. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపకల్పన చేసి, అనుమతులు, అభివృద్ధి పనులన్నీ కోర్ అర్బన్ చట్టం ఆధారంగా నిర్వహించాలన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని శాఖల రోడ్లను MAUD పరిధిలోకి తేవాలని చెప్పారు.

News February 28, 2026

హైవేపై బండి ఆగిపోయిందా? ఇలా చేయండి!

image

నేషనల్ హైవేలపై ప్రయాణించేటప్పుడు మీ వాహనంలో పెట్రోల్ అయిపోయిందా? అలాంటి సమయంలో మీకు హెల్ప్ చేసేందుకు NHAI సిబ్బంది ఉన్నారనే విషయం మీకు తెలుసా? టోల్ ఫ్రీ నంబర్‌ ‘1033’కు కాల్ చేస్తే నిమిషాల్లోనే హెల్పింగ్ టీమ్ మీ వద్దకు చేరుకుంటుంది. డబ్బులు చెల్లించి 5 లీటర్ల వరకు పెట్రోల్/ డీజిల్ పొందవచ్చు. అలాగే ఇతర అత్యవసర సేవలు కూడా అందజేస్తారు. అన్ని రకాల వాహనాలకు ఈ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి. SHARE IT