News March 16, 2025

పెద్దపల్లి: ‘వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి’

image

సింగరేణి వ్యాప్తంగా మాజ్దూర్ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న 103 మందికి గతేడాది 2024- April, mayనెలలకు సంబంధించిన వేతనాలు చెల్లించకపోవడంపై పెద్దపల్లి జిల్లా BJP అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి, రామగుండం నాయకురాలు కందుల సంధ్యారాణి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. KCP కంపెనీ కార్మికులకు ఏడాదిగా వేతనాలు చెల్లించకపోవడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు.

Similar News

News March 18, 2025

తుమ్మిడిహట్టి ఎత్తిపోతలపై కీలక ప్రకటన

image

TG: ఈ వేసవిలోనే తుమ్మిడిహట్టి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వచ్చే నెలలో సీఎం రేవంత్ మహారాష్ట్రలో పర్యటించి అక్కడి సీఎంతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎలా తీసుకురావాలనేదానిపై పరిశీలన జరుగుతోందన్నారు. కాళేశ్వరం పంప్ హౌసులను సరైన ఎత్తులో నిర్మించకపోవడంతో భారీ వరదలు వస్తే మునిగిపోతున్నాయని చెప్పారు.

News March 18, 2025

మంత్రి వర్గ సమావేశంలో మంత్రి గుమ్మిడి

image

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న కీలక నిర్ణయాల్లో ఆమె భాగస్వామ్యం అయ్యారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపారని ఆమె తెలిపారు.

News March 18, 2025

ప.గో : మహిళపై అత్యాచారం

image

అత్యాచారంపై న్యాయం చేయాలని ఆమె, కుటుంబీకులు సోమవారం ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఉండికి చెందిన తనపై రవి, సోమేశ్వరరావు పలుమార్లు అత్యాచారం చేసి, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.2.30 లక్షలు తీసుకున్నారని ఆరోపించింది. ఉండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే భర్త, మరిదిపై కౌంటర్ కేసు పెడతామని బెదిరించినట్లు తెలిపారు. విచారణ అధికారిగా ప.గో జిల్లా SPని నియమించినట్లు సమాచారం.

error: Content is protected !!