News March 16, 2025
రాజధానికి రూ.11వేల కోట్ల రుణం.. కీలక ఒప్పందం

AP: CM చంద్రబాబు సమక్షంలో హడ్కో- CRDA మధ్య ఒప్పందం జరిగింది. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణాలకు హడ్కో రూ.11వేల కోట్ల రుణం ఇవ్వనుంది. జనవరి 22న జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకరించగా, నేడు ఆ మేరకు ఒప్పందం జరిగింది. కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో CMD సంజయ్ కుల్ శ్రేష్ఠ పాల్గొన్నారు. వచ్చే నెల ప్రధాని చేేతుల మీదుగా రాజధాని పనులు పున: ప్రారంభం కానున్నాయి.
Similar News
News March 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 17, 2025
శుభ ముహూర్తం (17-03-2025)

☛ తిథి: బహుళ తదియ సా.4.57 వరకు తదుపరి చవితి ☛ నక్షత్రం: చిత్త మ.12.41 వరకు తదుపరి స్వాతి ☛ శుభ సమయం:1. ఉ.06.09 నుంచి 6.45 వరకు సా.7.21 నుంచి 7.45 వరకు ☛ రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
☛ యమగండం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు ☛ దుర్ముహూర్తం: మ.12.24 నుంచి 1.12వరకు 2. మ.2.46 నుంచి 3.34 వరకు ☛ వర్జ్యం: సా.6.46నుంచి 8.31 వరకు☛ అమృత ఘడియలు: ఉ.7.21
News March 17, 2025
TODAY HEADLINES

* రాజధానికి రూ.11వేల కోట్ల రుణం.. కీలక ఒప్పందం
* అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం: సీఎం
* హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ
* KCR జాతిపిత.. రేవంత్ బూతుపిత: హరీశ్‌రావు
* తాగుబోతోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా?: రేవంత్
* ఎ.ఆర్. రెహమాన్‌కు ఛాతీ నొప్పి, ఆస్పత్రిలో చేరిక
* యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు
* నా బాల్యమంతా తీవ్ర పేదరికంలోనే: PM మోదీ
* IML విజేతగా టీమ్ ఇండియా