News March 24, 2024
‘టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగిరేనా’

1982లో టీడీపీ స్థాపన అనంతరం నందిగామ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1989లో కాంగ్రెస్, 2019లో వైసీపీ మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తూ వస్తోంది. తాజాగా టీడీపీ తమ ఇన్‌ఛార్జ్ తంగిరాల సౌమ్యకు టికెట్ ఇవ్వగా, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్‌ను బరిలోకి దించింది. వచ్చే ఎన్నికల్లో పసుపు జెండా ఎగురుతుందా, వైసీపీ ఆధిపత్యం చూపునా మీ కామెంట్.
Similar News
News April 18, 2025
బాపులపాడు: మార్కెట్‌కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరి మృతి

బాపులపాడు మండలం వేలేరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేలేరు వద్ద కారు ఢీ కొనడంతో బైక్‌పై వెళ్తున్న బాబు అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇతను తేలప్రోలులో పట్టుగూళ్ల రీలింగ్ యూనిట్‌ని నిర్వహిస్తుంటాడు. పట్టుగూళ్ల కోసం హనుమాన్ జంక్షన్ మార్కెట్‌కు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
News April 18, 2025
ఘంటసాల: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..!

ఘంటసాల పరిధిలోని పాప వినాశనం వద్ద విషాదం చోటుచేసుకుంది. గురువారం KEB కాలువలో పదో తరగతి విద్యార్థి పవన్ గల్లంతయ్యాడు. దురదృష్టవశాత్తూ ఇదే స్థలంలో 11 ఏళ్ల క్రితం పవన్ తండ్రి కూడా మృతి చెందారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న కుమారుడు కాలువలో కొట్టుకుపోవడంతో తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. గ్రామస్థులు పవన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
News April 18, 2025
హనుమాన్ జంక్షన్‌లో తనిఖీలు చేసిన ఎస్పీ

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరికేడు అండర్ పాస్ వద్ద జరిగిన నాకాబందిలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గంగాధరరావు స్వయంగా వాహన తనిఖీలు చేశారు. వాహన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వారు ఎక్కడ నుంచి వస్తున్నది అడిగి తెలుసుకున్నారు.