News March 16, 2025

ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయండి: గొట్టిపాటి

image

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం శుభాకాంక్షలు చెప్పారు. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. జీవితంలో ఉన్నత చదువులకు తొలి మెట్టు పదవ తరగతి అన్నారు. ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

Similar News

News March 17, 2025

 MDCL: ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట మోసాలతో జాగ్రత్త 

image

రామంతపూర్లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్లో రీజినల్ ఇన్వెస్టర్ సెమినార్ నిర్వహించారు. ఇందులో SEBI ED రామ్మోహన్ రావు మాట్లాడుతూ..ఇన్వెస్ట్మెంట్ పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్, SEBI ద్వారా నిబంధనలు, ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధానాల గురించి తెలుసుకోవచ్చన్నారు.

News March 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 17, 2025

నెల్లూరు : 174 కేంద్రాలు…33,434 మంది విద్యార్ధులు

image

నెల్లూరు జిల్లాలో సోమవారం జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని DEO బాలాజీ రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 174 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 33,434 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ‌విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ముందు రావాలన్నారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్ష బాగా రాయాలన్నారు.

error: Content is protected !!