News March 16, 2025

ఎన్నో రూపాల్లో మోసాలు జరుగుతాయి: ఎస్పీ

image

బ్యాంకులు, ప్రభుత్వ సంస్థ, ఇతర విశ్వసనీయ సంస్థల నుంచి వచ్చినట్లుగా నమ్మించి నకిలీ ఈ మెయిల్‌లు, సందేశాలు పంపి మోసగిస్తారని, ఈ మోసాలు వివిధ రూపాల్లో జరుగుతాయని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. అనుమానాస్పదమైన ఈ మెయిల్‌ పట్ల జాగ్రత్త వహించాలన్నారు. వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలను అడిగే అభ్యర్థనలను బాగా గమనించండి. వెబ్‌సైట్‌ల URLలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు.

Similar News

News November 10, 2025

కర్రపెండలంలో బోరాన్ లోపం, నివారణ

image

కర్రపెండలంలో బోరాన్ లోపం వల్ల మొక్కల కణుపుల మధ్య దూరం తగ్గి, మొక్కల పెరుగుదల అంతగా ఉండదు. లేత ఆకులు కుచించుకుపోతాయి. గోధుమ రంగులో జిగురు పదార్ధం ఆకుల కాడలు, కాండం మొవ్వభాగంలో కనిపిస్తుంది. వేరు వ్యవస్థ పెరుగుదల దెబ్బతిని, మొవ్వభాగం ఎండి, దుంపలపై పగుళ్లు వస్తాయి. ఈ లోప నివారణకు ఎకరాకు 4KGల బోరాక్స్ భూమిలో వేసి కప్పాలి. ముచ్చెలను 1% బోరాక్స్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తర్వాత నాటాలి.

News November 10, 2025

NHSRCలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే ఆఖరు తేదీ

image

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌(NHSRC)లో 4 పోస్టులకు దరఖాస్తులు చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, బీకామ్, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, బీహెచ్ఎంస్, బీఏఎంస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://nhsrcindia.org/

News November 10, 2025

హనుమాన్ చాలీసా భావం – 5

image

హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై ||
హనుమంతుని ఒక చేతిలో ఎంతటి శత్రువునైనా మట్టుబెట్టేంత శక్తి కలిగిన వజ్రాయుధం(గద), మరో చేతిలో విజయానికి ప్రతీకైన పతాకం ప్రకాశిస్తుంటాయి. ఆయన భుజంపై ఉండే జంధ్యం ఆయన అపారమైన శక్తి, విజయం మరియు, సూచిస్తుంది. మనం కూడా హనుమంతునిలా ధైర్యాన్ని, సత్యాన్ని ఆశ్రయిస్తే జీవితంలో తప్పక విజయం సాధిస్తాం. <<-se>>#HANUMANCHALISA<<>>