News March 16, 2025
గ్రూప్-1 ఫలితాల్లో వారికి అన్యాయం: కవిత

TG: గ్రూప్-1 ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న సందేహాలను ప్రభుత్వంతో పాటు TGPSC నివృత్తి చేయాలని BRS ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆమెను కలిసి చర్చించారు. పేపర్ వాల్యూయేషన్‌లో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. గ్రూప్-2 ఫలితాల్లో 13వేల మందిని ఇన్వాలిడ్‌గా ఎలా ప్రకటించిందో చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు.
Similar News
News March 18, 2025
తుమ్మిడిహట్టి ఎత్తిపోతలపై కీలక ప్రకటన

TG: ఈ వేసవిలోనే తుమ్మిడిహట్టి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వచ్చే నెలలో సీఎం రేవంత్ మహారాష్ట్రలో పర్యటించి అక్కడి సీఎంతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎలా తీసుకురావాలనేదానిపై పరిశీలన జరుగుతోందన్నారు. కాళేశ్వరం పంప్ హౌసులను సరైన ఎత్తులో నిర్మించకపోవడంతో భారీ వరదలు వస్తే మునిగిపోతున్నాయని చెప్పారు.
News March 18, 2025
తెలంగాణ ప్రభుత్వానికి బాంబే హైకోర్టు నోటీసులు

అనుమతి లేకుండా మహిళల ఫొటోల వినియోగం ఆందోళనకరమని, వాటిని ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగించినా అది వాణిజ్య దోపిడీ కిందికే వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. అంగీకారం లేకుండా మహిళల ఫొటోలు ప్రకటనల్లో వాడుతున్నారనే నమ్రత అంకుశ్ అనే మహిళ పిటిషన్‌పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఈ నెల 24లోగా సమాధానం చెప్పాలని కేంద్రం, తెలంగాణ, MH, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ఇతరులకు ఆదేశాలిచ్చింది.
News March 18, 2025
భగవద్గీత నాకు బలాన్ని, శాంతిని ఇస్తుంది: తులసీ గబ్బార్డ్

భగవద్గీత తనకు ప్రశాంతతను, మనోస్థైర్యాన్ని ఇస్తుంటుందని అమెరికా నిఘా సంస్థల డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆమె ANIతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘భారత్‌కు వస్తే సొంత ఇంటికి వచ్చినట్లుంటుంది. ప్రజలు ఎంతో సాదరంగా మాట్లాడుతారు. ఆహారం అత్యంత రుచికరంగా ఉంటుంది. నేను యుద్ధక్షేత్రంలో ఉన్న సమయంలో భగవద్గీత నాకు ఊరటనిచ్చేది’ అని వివరించారు. ఆమె హిందూమతాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.