News March 16, 2025
భారత త్రో బాల్ జట్టుకు ఎంపికైన వెన్నపూస రోషీ రెడ్డి

భారత త్రో బాల్ జట్టుకు అనంతపురానికి చెందిన వెన్నుపూస రోషీ రెడ్డి ఎంపికయ్యారు. భారత పారా త్రో బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఆల్బర్ట్ ప్రేమ్ కుమార్ ఎంపికైన లేఖను పంపించినట్లు రోషీ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా దివ్యాంగుల క్రికెట్ సంఘం అధ్యక్షులు డాక్టర్ శంకర్ నారాయణ అతడిని అభినందించారు. కంబోడియాలో జరిగే ఆసియా పారా త్రోబాల్ టోర్నమెంట్లో భారత జట్టు తరపున ఆడనున్నారు.
Similar News
News January 23, 2026
కనేకల్: పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20 మందికి అస్వస్థత

కనేకల్ మండలం 43 ఉడేగోళం పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. తిన్న వెంటనే వాంతులు, విరేచనాలు కావడంతో ఉపాధ్యాయులు వారిని కనేకల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.
News January 23, 2026
మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: ఎస్పీ

వాహనదారులకు ఎస్పీ జగదీశ్ పలు సూచనలు చేశారు. అనంతపురంలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. దీనివల్ల సాటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
News January 23, 2026
ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యంగా తనిఖీలు

అనంతపురంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో అర్ధరాత్రి వరకు పోలీసులు డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ & లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు.


