News March 24, 2024
ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన ‘ఓపెన్ హైమర్’ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల జియో సినిమాలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే స్ట్రీమింగ్ అవ్వగా.. తాజాగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. జియో సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారు సినిమాను ఉచితంగా చూడవచ్చు. అణు బాంబు సృష్టికర్త ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఏడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.
Similar News
News November 2, 2024
ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు సిట్‌కు బదిలీ
TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై ఇప్పటివరకు సిట్ 3 కేసులు నమోదు చేసింది. అటు విగ్రహం ధ్వంసం చేసిన ప్రధాన నిందితుడు సల్మాన్ సలీంకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడ్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
News November 2, 2024
39,481 ఉద్యోగాలు.. అభ్యర్థులకు BIG ALERT
BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCBలో 39,481 GD కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం గత నెలలో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. అయితే అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో సవరణ చేసుకునేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 7వ తేదీ రాత్రి 11 వరకు మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. గడువు ముగిసిన తర్వాత వచ్చే ఎలాంటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
News November 2, 2024
మోదీ గ్యారంటీ అనేది క్రూరమైన జోక్: ఖర్గే
మోదీ గ్యారంటీ అనేది 140 కోట్ల మంది భారతీయులపై ఓ క్రూరమైన జోక్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే దుయ్యబట్టారు. కాంగ్రెస్ గ్యారంటీలను మోదీ విమర్శించడంపై ఖర్గే స్పందిస్తూ BJPలో B అంటే బిట్రేయల్(మోసం), J అంటే జుమ్లా(అబద్ధం) అని మండిపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు, అచ్చే దిన్, వికసిత్ భారత్, నేను తినను-తిననివ్వను, సబ్‌కా సాత్-సబ్‌కా వికాస్ నినాదాలు ఏమయ్యాయని ఖర్గే ప్రశ్నించారు.