News March 16, 2025

రాజమండ్రి: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు

image

విశాఖపట్నం -లింగంపల్లి, లింగంపల్లి- విశాఖపట్నం మధ్య రోజు నడిచే రైళ్లు శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లించడం జరిగిందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జన్మభూమి ఎక్సె‌ప్రెస్ గోదావరి జిల్లాల ప్రజలకు ముఖ్య రవాణాగా ఉంది. నేటి నుంచి చర్లపల్లి – అమ్ము గూడ – సనత్ నగర్ మీదుగా దారి మళ్లించామని పేర్కొన్నారు. ఏప్రిల్ 25వ తారీకు వరకు సికింద్రాబాద్ వెళ్లదని రైల్వే అధికారులు తెలిపారు.

Similar News

News March 18, 2025

రాజమండ్రి: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సభ్యుల క్రీడా పోటీలు

image

ఎమ్మెల్యేలకు,ఎమ్మెల్సీలకు ఆహ్లాదాన్ని ఇచ్చే దిశగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. క్రీడా పోటీల కోసం జరుగుతున్న ఏర్పాట్లను శాప్ ఛైర్మన్ రవి నాయుడుతో కలిసి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు సోమవారం పర్యవేక్షించారు. ఈ క్రీడా పోటీల్లో 173మంది ఎమ్మెల్యేలు, 31మంది క్రికెట్, 25 మంది బ్యాట్మెంటిన్ వాలీబాల్ ఆడనున్నారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు.

News March 17, 2025

రాజమండ్రి: భానుడి భగభగ

image

తూ.గో. జిల్లాలో అప్పుడే ఎండ దంచేస్తుంది. కొన్ని మండలాల్లో వడగాలుల వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం రాజమండ్రిలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది. వడ గాల్పులతో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు జాగ్రత్తలు తీసుకుని బయటికి రావాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

News March 17, 2025

రాజమండ్రి: రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ నిర్వహణ

image

ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పీజీఆర్‌ఎస్ కార్యక్రమం మార్చి 17 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్, డివిజన్, మండల కేంద్రం, మున్సిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పరిధిలోని సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు.

error: Content is protected !!