News March 16, 2025

గోద్రా అల్లర్లపై అది తప్పుడు ప్రచారం: మోదీ

image

గుజరాత్ గోద్రా అల్లర్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అల్లర్లుగా పేర్కొనడం అనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్‌లో పెద్ద అల్లరి జరగలేదని, ఆ రాష్ట్రం శాంతియుతంగా ఉందని చెప్పారు. ఆ సమయంలో కేంద్రంలో తమ ప్రత్యర్థులు అధికారంలో ఉండటంతో తమపై వచ్చిన ఆరోపణలను నిలబెట్టాలని చూశారన్నారు. అయితే న్యాయవ్యవస్థ తమను నిర్దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు.

Similar News

News December 30, 2025

రైతులు ఆందోళన చెందవద్దు: తుమ్మల

image

TG: రాష్ట్రంలో యూరియా సరఫరా కొనసాగుతోందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాల్లో 47.68 లక్షల సంచుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. రబీ సీజన్(అక్టోబర్-మార్చి)లో కేంద్రం రాష్ట్రానికి 20.10 లక్షల మెట్రిక్ టన్నుల(LMTs) యూరియా కేటాయించిందని తెలిపారు. ఇప్పటివరకు అందిన 5.70LMTs యూరియాలో 3.71LMTs రైతులు కొనుగోలు చేయగా 2.15LMTs జిల్లాల్లో అందుబాటులో ఉందన్నారు.

News December 30, 2025

వచ్చే ఏడాదీ రిపీట్ చేస్తారా?

image

కొత్త సంవత్సరం మొదలవుతుందంటే చాలు ఎక్కడ లేని రెజల్యూషన్స్ వస్తాయి. జిమ్‌కు వెళ్లడం, డైట్ మెయింటేన్ చేయడం, హెల్త్‌ను కాపాడుకోవడం, డబ్బులు సేవ్ చేసుకోవడం అంటూ నిర్ణయాలు తీసుకుంటారు. 2025 ప్రారంభంలోనూ ఇలాంటి నిర్ణయాలే తీసుకొని ఉంటారు. వీటిలో ఎన్ని ఆచరణలో పెట్టారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? మారింది ఇయర్ మాత్రమేనా? మీ లైఫ్‌లో చోటు చేసుకున్న మార్పులు ఏంటి?

News December 30, 2025

నాన్న లేని లోకంలో ఉండలేక.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన

image

TG: తల్లి చిన్నప్పుడే దూరమవడంతో తండ్రే లోకంగా పెరిగాడు నితిన్‌. తండ్రి నాగారావు అమ్మలా గోరుముద్దలు తినిపించాడు. ఫ్రెండ్స్‌లా ప్రతి విషయం షేర్ చేసుకునేవారు. అలాంటి తండ్రి 3 రోజుల క్రితం మృతిచెందడంతో తట్టుకోలేకపోయాడు. అంత్యక్రియల తర్వాత ఇంటి నిండా నిశ్శబ్దం అతడిని మరింత కుంగదీసింది. నాన్న లేని లోకంలో ఉండలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్‌ జిల్లా బాసరలో జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.