News March 24, 2024
జగిత్యాల: అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష

గొల్లపల్లి మండలం దట్నూరుకు చెందిన హరికృష్ణ A/S హరీష్ కిరాణం నిర్వహిస్తుండేవాడు. సరుకుల కోసం వచ్చే బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పగా 2022 ఏప్రిల్ 7న పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. శనివారం నేరం రుజువు కావడంతో JGL న్యాయమూర్తి నీలిమ ఒక్కోకేసులో 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా, ముగ్గురు బాలికలకు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు.
Similar News
News September 8, 2025
KNR: నేడు రాజకీయ పార్టీల నేతలతో జిల్లా కలెక్టర్ సమావేశం

కరీంనగర్ నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం రాజకీయ పార్టీలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాటుపై సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
News September 7, 2025
కరీంనగర్‌లో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం

KNR DCC కార్యాలయంలో ఆదివారం జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని బ్లాక్, మండల, పట్టణ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతంపై చర్చించారు. నాయకురాళ్లు తమ అభిప్రాయాలు, సూచనలను పంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని తీర్మానం చేశారు.
News September 7, 2025
కరీంనగర్: ఓపెన్ స్కూల్లో చేర్చాలి

స్వయం సహాయక సంఘాల సభ్యులను ఓపెన్ స్కూల్లో చేర్చాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మెప్మా, డీఆర్‌డీఓ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఉల్లాస్ రిజిస్ట్రేషన్లపై శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన సభ్యులందరినీ వెంటనే ఓపెన్ స్కూల్లో చేర్పించి, విద్యను ప్రోత్సహించాలని సూచించారు.