News March 16, 2025
పార్టీ కమిటీలను వెంటనే నియమించాలి: సజ్జల

AP: ప్రతి నియోజకవర్గంలో పార్టీ కమిటీల ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని YCP రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి నేతలను ఆదేశించారు. వీటి విషయంలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదన్నారు. ఇందుకోసం పార్టీ సెంట్రల్ ఆఫీసులో జనరల్ సెక్రటరీలు, రీజనల్ కో ఆర్డినేటర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. కమిటీ ఏర్పాట్లపై పార్టీ అధినేత జగన్ దృష్టి పెట్టారని, జిల్లా అధ్యక్షులు వెంటనే వీటిపై స్పందించాలని సూచించారు.
Similar News
News March 17, 2025
మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం

AP: వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఎర్రం పిచ్చమ్మ(85) ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మాతృమూర్తి మృతితో వైవీ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 17, 2025
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ఎక్కడా?: వైసీపీ

AP: అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తానని ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గెలిచాక మాట మరచిపోయారని వైసీపీ విమర్శించింది. దేశంలో అన్నిరాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ రేట్లు అధికంగా పెరిగాయంది. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంధన ధరల్ని కూటమి ప్రభుత్వం ఎందుకు తగ్గించట్లేదని X వేదికగా వైసీపీ ప్రశ్నించింది.
News March 17, 2025
పార్లమెంట్, అసెంబ్లీ ప్రాంగణాల్లో అరకు కాఫీ స్టాల్స్

పార్లమెంటు, AP అసెంబ్లీ ప్రాంగణాల్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతించిన నేపథ్యంలో నేటి నుంచి పార్లమెంటు ప్రాంగణంలో స్టాళ్లను ప్రారంభిస్తున్నామని గిరిజన సహకార సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులందరికీ ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక AP అసెంబ్లీ ప్రాంగణంలో మరో రెండు రోజుల్లో స్టాల్స్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.