News March 17, 2025
రేగొండ: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త ఆత్మహత్య

రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన చావడి లక్ష్మి నరసయ్య(50) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నరసయ్య.. కుటుంబ ఆర్థిక విషయాల్లో భార్యాభర్తలు గొడవ పడినట్లు చెప్పారు. కాగా మనస్తాపం చెందిన నరసయ్య ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.
Similar News
News March 17, 2025
మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం

AP: వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఎర్రం పిచ్చమ్మ(85) ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మాతృమూర్తి మృతితో వైవీ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 17, 2025
జలుమూరు : ఖైదీలకు ఫోన్లు అందించిన దంపతులు అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా జలుమూరు పీఎస్ విధులు నిర్వహిస్తున్న భార్యాభర్తలను అరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ కారాగారంలో పని చేసిన ఫార్మాసిస్టు శ్రీనివాసరావుతో పాటు అతడి భార్య పుష్పలతను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. జైలులో ఉన్న నాగమల్లేశ్వరావు అనే ముద్దాయికి ఫోన్లు అందించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
News March 17, 2025
VKB: పెన్సిల్స్ లోడ్ పంపిస్తామని సైబర్ నేరగాళ్ల బురిడీ

పెన్సిల్స్ లోడ్ పంపిస్తామని ఓ గృహిణిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. పెద్దేముల్ మండల పరిధిలోని నాగులపల్లికి చెందిన యూనుస్ భార్య స్నాప్ చాట్ చూస్తున్న క్రమంలో ఓ లింకును ఓపెన్ చేశారు. పెన్సిల్ లోడ్ మీ వద్దకు వస్తుందని.. అవి ప్యాక్ చేస్తే నెలకు రూ.30 వేల వేతనం ఇస్తామంటూ నమ్మబలికారు. ఐడీ కార్డు ఇతరత్రా వాటికోసం రూ.13వేలు చెల్లించారు. కాగా, మోసపోయిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.