News March 17, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామ: విజయవంతంగా కొనసాగిన సీఎం పర్యటన > దేవరుప్పుల: తాడి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి > జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతి > సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు > సీఎం పర్యటన పలువురు నేతల ముందస్తు అరెస్ట్ > తూతూ మంత్రంగానే సీఎం పర్యటన ఉంది: తాటికొండ రాజయ్య > అక్రమ అరెస్టులను ఖండించిన సిపిఎం నేతలు > జిల్లా అధికారులను అభినందించిన కలెక్టర్

Similar News

News March 17, 2025

JGTL: రాజీవ్ యువ వికాసం.. యువతలో ఆశలు..!

image

‘రాజీవ్ యువ వికాసం’తో ఉమ్మడి KNR జిల్లాలోని యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పథకం ద్వారా SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనున్నారు. ఈనెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన వారికి రూ.3 లక్షలలోపు విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://tgobmms.cgg.gov.in సైట్‌ను వీక్షించవచ్చు. SHARE IT.

News March 17, 2025

ఆదిలాబాద్: నేడు, రేపు వడగాలులు

image

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా సోమవారం, మంగళవారం రెండు రోజులు ఉమ్మడి జిల్లాలో వడగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. కాగా చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించింది.

News March 17, 2025

KMM: ప్రేమించుకుని పెళ్లి.. నెలన్నరకే ఆత్మహత్య

image

జడ్చర్ల మండలంలో నవ వధువు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌కుమార్, ఖమ్మం జిల్లాకు చెందిన చర్చిత(23) ఖమ్మంలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 45రోజుల క్రితం పెళ్లిచేసుకున్నారు. కారణం ఏంటో తెలియదు కాని పవన్ ఇంట్లో నుంచి బయటికెళ్లగానే చర్చిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

error: Content is protected !!