News March 17, 2025
సీఎంని తిట్టడం అప్రజాస్వామికం: జస్టిస్ సుదర్శన్ రెడ్డి

HYD: ఇటీవల మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును ఎడిటర్ గిల్డ్స్ ఎలా ఖండిస్తుందని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఆమె పెట్టిన కంటెంట్‌ను పరిశీలించారా, మీడియాలో అలాంటి భాష వాడొచ్చా అని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో లేని ముఖ్యమంత్రి కుటుంబంలోని మహిళలను బూతులు తిట్టడం స్వేచ్ఛ కిందికి రాదన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు పాశం యాదగిరి, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డిలున్నారు.
Similar News
News January 7, 2026
HYDలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

సంక్రాంతి సందర్భంగా HYDలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. జనవరి 16- 18 వరకు పరేడ్ గ్రౌండ్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. అలాగే పరేడ్ గ్రౌండ్, బతుకమ్మ కుంట, నల్ల చెరువు తదితర ప్రాంతాల్లో పతంగులు, మిఠాయిల పండుగ నిర్వహిస్తారు. వీటితో పాటు జనవరి 16, 17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేకంగా డ్రోన్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నారు.
News January 7, 2026
HYD టాస్క్‌ఫోర్స్‌లో ఒకేసారి 65 మంది పోలీసులు బదిలీ

నగర పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతూ టాస్క్ ఫోర్స్ టీమ్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పారదర్శకత, పనితీరు మెరుగుపరచడమే లక్ష్యంగా 65 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ HYD కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసేందుకే ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
News January 7, 2026
యాదాద్రి వద్దు.. చార్మినార్‌లో కలపాలి!

TGలో మరో ఉద్యమం ఉద్ధృతమవుతోంది. పోలీస్ నియామకాలలో జోన్‌ల వివాదం అగ్గి రాజేసుకుంటోంది. రాచకొండను యాదాద్రి జోన్‌లో ఉంచడం సిటీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయమని మండిపడుతున్నారు. సూర్యాపేట, NLG, యాదాద్రి జిల్లాల వల్ల కట్‌ఆఫ్ పెరిగి మేడ్చల్, RR అర్బన్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి కొత్త కమిషనరేట్ కావడంతో, దీన్ని చార్మినార్ జోన్‌లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.


