News March 17, 2025
రాజమండ్రి: పది పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉ. 9.30 నుంచి మ. 12.45 వరకూ పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. తాగునీరు, వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు.
Similar News
News January 12, 2026
తూ.గో: అన్నను రోకలిబండతో కొట్టి చంపిన తమ్ముడు

కుటుంబ కలహాలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నిడదవోలు(M) అట్లపాడులో బండి కోట సత్యనారాయణ(28) అనే యువకుడు తన తమ్ముడు సాయిరాం చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో సాయిరాం రోకలిబండతో అన్న తలపై బలంగా కొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లి దుర్గ భవాని ఉన్నారు. సమిశ్రగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.
News January 12, 2026
తూ.గో: ఇనుపరాడ్‌తో కొట్టి భార్యను హతమార్చిన భర్త

కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాన్ని బలిగొన్నాయి. రాజమండ్రి రూరల్(M) కొంతమూరులోని బూసమ్మకాలనీకి చెందిన కన్నారామకృష్ణ శనివారం అర్ధరాత్రి భార్య పద్మ(36)తో గొడవపడి, పదునైన ఇనుపరాడ్‌తో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వీరయ్యగౌడ్ వెల్లడించారు.
News January 12, 2026
తూ.గో: నేడు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు

తూ.గో జిల్లాలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం PGRS కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. నేడు భూమి సంబంధిత సమస్యల తక్షణ పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు పలు రెవెన్యూ రికార్డులతో ఈ ప్రోగ్రామ్‌కు హాజరుకావాలన్నారు.


