News March 17, 2025
భీమిలి ఎమ్మెల్యేను కలిసిన స్టార్ డైరెక్టర్

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును విశాఖ, ఎం.వి.పి.కాలనీలోని ఆయన స్వగృహంలో స్టార్ డైరక్టర్ అనిల్ రావిపూడి టీం ఆదివారం కలిశారు. ప్రస్తుత సినిమాలు గురించి, మెగాస్టార్ చిరంజీవితో తాను తెరకెక్కించనున్న కొత్త సినిమా గురించి కొంతసేపు మాట్లాడుకున్నారు. కొత్త చిత్రాన్ని తెరకెక్కించే ముందు, ఆ కథతో వచ్చి సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవడం తనకు సెంటిమెంట్ అని అన్నారు.
Similar News
News March 17, 2025
అనకాపల్లి: దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. నిలిచిన రైళ్లు

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. రాత్రి రైల్వే వంతెన కింద నుంచి వెళ్తున్న ఓ భారీ వాహనం గడ్డర్‌ను ఢీకొనడంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో కశింకోటలో గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు, యలమంచిలిలో మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
News March 17, 2025
టెన్త్ విద్యార్థులకు ఫ్రీ బస్

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో విశాఖ జిల్లాలోని విద్యార్థులందరినీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం 7 డిపోల నుంచి 150 బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా సమయానికి ముందు, ముగిసిన తర్వాత 2.30 గంటల వరకు బస్సులు షెడ్యూల్, స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హాల్ టికెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.
News March 17, 2025
విశాఖ నుంచి HYD ట్రావెల్స్ బస్సులో మంటలు

విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదం స్వల్పమే అయినప్పటికీ బస్సు నిలిపివేయడంతో ప్రత్యామ్నాయంగా రావాల్సిన బస్సు రెండు గంటలు కావస్తున్నా రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా నక్కపల్లి హైవేపై చోటు చేసుకుంది. బస్సు వెళ్తుండగా వెనక చక్రాల డమ్ములు గట్టిగా పట్టేయడంతో స్వల్ప మంటలు చేలరేగాయి. ఈ ఘటన 9 గంటలకు జరిగింది.