News March 24, 2024
REWIND: చంద్రగిరిలో TDP ఓటమికి కారణం అదే..!

చంద్రబాబుతో విభేదించి ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. చిత్తూరు ఎంపీ సీటు ఆశించినా దక్కలేదు. దీంతో చంద్రగిరి నుంచి ఇండిపెండెంట్ MLA అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో గల్లా అరుణకుమారి కాంగ్రెస్ MLAగా 14,392 ఓట్ల మెజార్టీతో గెలిచారు. TDP అభ్యర్థి రామనాథం నాయుడుకు 32,2446 ఓట్లు పడ్డాయి. రామ్మూర్తికి ఏకంగా 31,525 ఓట్లు రావడంతో అక్కడ TDP ఓడిపోయింది.
Similar News
News March 2, 2026
చిత్తూరు: కరెంట్ సమస్య ఉంటే కాల్ చేయండి!

చిత్తూరు జిల్లాలో చాలా మంది లోవోల్టేజ్, ఎక్కువ కరెంట్ ఛార్జీలు, మీటర్ల నూతన కనెక్షన్లు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారానికి ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నేడు నిర్వహిస్తున్నామని ఎస్ఈ ఇస్మాయిల్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల లోపు 79931 47979 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారు.
News March 2, 2026
నేడు చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.
News March 1, 2026
చౌడేపల్లి: చిరుత దాడిలో దూడ మృతి

చౌడేపల్లి మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన రైతు గిరి తన పశువుల మేత కోసం గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో తోలుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద వక్కిరి వద్ద పశువులు మేత మేస్తుండగా చిరుత దాడి చేసినట్లు రైతు తెలిపాడు. ఈ దాడిలో దూడ మృతి చెందినట్లు వాపోయాడు. చిరుత పులి దాడి నుంచి పశువులను కాపాడాలని రైతులు కోరుతున్నారు.


