News March 17, 2025
ప్రజావాణి రద్దు: జనగామ కలెక్టర్

జనగామ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రకటనలో తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్‌లో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి వినతులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దన్నారు.
Similar News
News July 4, 2025
విశాఖలో 50 అంతస్తుల అపార్ట్మెంట్లు.. డిజైన్లు ఇవే

విశాఖలో మధురవాడ పరిసర ప్రాంతాల్లో 50 అంతస్తుల 3BHK, 4 BHK ఫ్లాట్స్, 4BHK డూప్లెక్స్ ఫ్లాట్స్‌ని V.M.R.D.A నిర్మించనుంది. సర్వే నంబర్ 331/1 లోని 4.07 ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ల నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేశారు. 6 టవర్లు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ తదితర అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. జాయింట్, PPP పద్ధతిలో ఈ ప్రాజెక్టు చేపడతారు. విశాఖలో ఇప్పటివరకు 50 అంతస్తులు అపార్ట్మెంట్లు లేవు.
News July 4, 2025
V.M.R.D.A. పరిధిలో అభివృద్ధి పనులకు ఆమోదం

విశాఖలో V.M.R.D.A. బోర్డు సమావేశం శుక్రవారం జరిగింది. పలు అంశాలకు బోర్డు ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా కొత్తూరులో 5.68 ఎకరాల్లో పార్కు నిర్మించనున్నారు. వేపగుంట-పినగాడి మధ్య 60 అడుగుల రోడ్డు నిర్మిస్తారు. మధురవాడ, మారికవలస, వేపగుంటలో అపార్ట్మెంట్లు నిర్మించేందుకు అమోదం తెలిపారు. ఛైర్మన్ ప్రణవ గోపాల్, ఎంసీ విశ్వనాథన్, పురపాలక శాఖ కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు.
News July 4, 2025
నగర వైభవాన్ని చాటిచెప్పేలా విజయవాడ ఉత్సవ్: ఎంపీ చిన్ని

ఇంద్రకీలాద్రిపై ఏటా శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో విజయవాడ ఉత్సవ్‌పై జరిగిన ప్రాథమిక సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశా, సీపీ రాజశేఖర్ బాబు, తదితరులు పాల్గొని సాధ్యాసాధ్యాలపై చర్చించారు. విజయవాడ నగర పర్యటన మధురాను భూతులు మిగిల్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తున్నట్లు తెలిపారు.