News March 17, 2025
మెదక్: ఒంటిపూట బడుల వేళల్లో మార్పులు: డీఈవో

మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పని వేళల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. పాఠశాలలు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడపాలని సూచించారు.
Similar News
News January 16, 2026
37 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏఎస్పీ మహేందర్

అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ 1989లో పోలీస్ శాఖలో చేరి 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలంపాటు నిర్విరామంగా సేవలందిస్తూ, క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజాసేవలో ఆదర్శంగా నిలుస్తోన్న అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ సేవలను ఎస్పీ కొనియాడారు.
News January 16, 2026
మెదక్: రోడ్డు భద్రతపై సిబ్బందికి అవగాహన

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయ అధికారులు ఉద్యోగులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీవోలు పాల్గొన్నారు.
News January 15, 2026
పీహెచ్‌సీలల్లో మందుల కొరత ఉండొద్దు: మెదక్ కలెక్టర్

పీహెచ్‌సీలల్లో అన్ని రకాల మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల గది, రికార్డులు, హాజరు పట్టికని పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని, అన్ని పరీక్షలు, మందులు నాణ్యతతో ఉచితంగా అందించాలని సూచించారు.


