News March 17, 2025

పెళ్లైన మగవారు బరువు ఎందుకు పెరుగుతారంటే?

image

వివాహం తర్వాత పురుషులు అనూహ్యంగా బరువు పెరుగుతుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పెళ్లైన ఆనందంలో పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లి కొంచెం ఎక్కువగా ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఈ సమస్య వస్తుంది. బాధ్యతలు పెరిగి జిమ్‌కు వెళ్లే సమయం ఉండదు కాబట్టి బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరిగిపోతారు. హార్మోన్ల మార్పుల వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి మరో కారణం.

Similar News

News March 17, 2025

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గొప్పతనం ఇదే..

image

TG రాజకీయ, సాంఘిక చైతన్యానికి మరోపేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, పండితుడు, రచయిత, నిజాం వ్యతిరేక ఉద్యమ నేతగా ఆయన సుపరిచితుడు. ‘నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము’ అన్న నిందను సవాల్‌గా తీసుకొని 354 కవులతో ‘గోల్కొండ కవుల సంచిక’ గ్రంథం ప్రచురించారు. గోల్కొండ పత్రికనూ నడిపారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషాలు, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు వంటి పుస్తకాలు రాశారు.

News March 17, 2025

తెలుగువారి చరిత్రను తెలుగువారికి చాటిన సురవరం

image

ఆంధ్రము అంటే తెలుగు. ఆంధ్రులు అంటే తెలుగువారు. మన చరిత్రను మనకు తెలిపిన, ప్రపంచానికి చాటిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ మన గొప్పేంటో, తప్పేంటో వివరించింది. ఆంధ్రుల సంస్కృతి, రాజులు, పంటలు, పండుగలు, కవులు, యాసలు, భాష, వేషం గురించి ఇందులో తెలుసుకోవచ్చు. ముక్కుపుల్ల, అష్టాచెమ్మ, గుజ్జనగూళ్లు సహా మన పూర్వీకుల బాల్యపు ఆటల గురించి తెలిస్తే అమ్మో అనాల్సిందే. SHARE.

News March 17, 2025

పొట్టిశ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఆమోదం

image

TG: పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!