News March 24, 2024
నంద్యాల: టీడీపీలో చేరిన చల్లా కుటుంబ సభ్యులు

బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. దివంగత మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి సోదరుడు, అవుకు కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ చల్లా విజయ భాస్కర్ రెడ్డి, ఆయన బావమరిది కాశీపురం మెట్ల రామిరెడ్డి టీడీపీలో చేరారు. అమరావతిలోని చంద్రబాబు స్వగృహం నందు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News March 30, 2026
కర్నూల్: పోలీస్ ప్రజా ఫిర్యాదుల వేదికకు 98 వినతులు

కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు జిల్లావ్యాప్తంగా 98 వినతులు అందాయి. ఉద్యోగాల పేరిట మోసాలు, ఆర్థిక వివాదాలు, కుటుంబ సమస్యలపై ప్రజలు మొరపెట్టుకున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
News March 30, 2026
కర్నూల్: పీజీఆర్ఎస్‌లో డీఆర్‌వో వినతుల స్వీకరణ

ప్రజల ఫిర్యాదులను నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించాలని డీఆర్‌వో సి.వెంకట నారాయణమ్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల వినతులు స్వీకరించి, పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. రీ-ఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
News March 30, 2026
దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు: కలెక్టర్ సిరి

వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కర్నూలులోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో తాగునీరు, చల్లని మజ్జిగను నిరంతరం అందుబాటులో ఉంచుతామని ఆమె తెలిపారు. వడదెబ్బ నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధాన ప్రాంతాల్లో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.


