News March 17, 2025
‘రూ’ అక్షరాన్ని నిర్మలా సీతారామన్ కూడా వాడారు: స్టాలిన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం గతంలో తమిళ ‘రూ’ సింబల్ ని వాడారని CM స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం మా ప్రభుత్వం కూడా ‘రూ’ అనే అక్షరాన్ని వినియోగించిందని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. తమ మాతృభాషను రక్షించుకోవడానికే NEPని వ్యతిరేకిస్తున్నామని, భాషపై గందరగోళం సృష్టించేవారు కేంద్రమంత్రి చర్య పైనా మాట్లాడాలని అన్నారు. బడ్జెట్ సమయంలో ‘రూ’ అక్షరం వాడటంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
Similar News
News March 17, 2025
తెలుగువారి చరిత్రను తెలుగువారికి చాటిన సురవరం

ఆంధ్రము అంటే తెలుగు. ఆంధ్రులు అంటే తెలుగువారు. మన చరిత్రను మనకు తెలిపిన, ప్రపంచానికి చాటిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ మన గొప్పేంటో, తప్పేంటో వివరించింది. ఆంధ్రుల సంస్కృతి, రాజులు, పంటలు, పండుగలు, కవులు, యాసలు, భాష, వేషం గురించి ఇందులో తెలుసుకోవచ్చు. ముక్కుపుల్ల, అష్టాచెమ్మ, గుజ్జనగూళ్లు సహా మన పూర్వీకుల బాల్యపు ఆటల గురించి తెలిస్తే అమ్మో అనాల్సిందే. SHARE.
News March 17, 2025
పొట్టిశ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఆమోదం

TG: పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
News March 17, 2025
బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన పొన్నం

TG: బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లకు వేర్వేరుగా బిల్లులను తీసుకొచ్చింది. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.