News March 17, 2025

జియ్యమ్మవలసలో ఏనుగులు గుంపు సంచారం

image

జియ్యమ్మవలస మండలం నందివాని వలస, తోటపల్లి, సింగాణపురం గౌరీపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి చెరకు, అరటి తోటల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయవద్దని, రైతులు పొలాలకు వెళ్లొద్దని సూచించారు. 

Similar News

News November 10, 2025

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం, NHAIకి SC నోటీసులు

image

ఇటీవల TG, రాజస్థాన్‌లలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీం కోర్టు విచారించింది. NHల నిర్వహణపై నివేదిక ఇవ్వాలని కేంద్రం, NHAIని ఆదేశించింది. రోడ్లపై వాహనాల పార్కింగ్ వల్లే ఈ ప్రమాదాలని జస్టిస్ JK మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిలో ఆయా రాష్ట్రాల CSలనూ పార్టీగా చేర్చాలని పేర్కొంది. రోడ్డు ప్రమాదాల్లో TGలో 19మంది, రాజస్థాన్‌లో 18మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.

News November 10, 2025

కార్పొరేషన్ల డైరెక్టర్లుగా విజయనగరం నేతలకు అవకాశం

image

జిల్లాకు చెందిన పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను వివిధ కార్పొరేషన్లకు రాష్ట్ర డైరెక్టర్లుగా నియమిస్తూ కూటమి ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
> రమణాజీ& బంగారునాయుడు-దాసరి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్(ఎస్.కోట)
> మల్లేశ్వరావు-కలింగ కోమటి(విజయనగరం)
> కాళ్ల సత్యవతి&కొండల శ్రీనివాస్-నాగవంశం(నెల్లిమర్ల)
> సుంకరి సాయి రమేశ్-కళింగ వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ డైరెక్టర్(బొబ్బిలి)

News November 10, 2025

యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

నరసన్నపేట మండలం కోమార్తి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కారు మరమ్మతులకు గురికావడంతో పెద్దపాడు నుంచి మెకానిక్ కోరాడ వెంకటేశ్ వచ్చి మరమ్మతులు చేస్తున్నాడు. ఆ సమయంలో వెనక నుంచి వస్తున్న కారు ఆగి ఉన్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్ మృతిచెందగా కారులో ఉన్న సంతోశ్, సుశీల, శ్యాముల్ గాయపడ్డారు.