News March 17, 2025
ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్ కూడా నేటి నుంచే..

AP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి (ఓపెన్ టెన్త్) పరీక్షలు కూడా నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ పరీక్షలు జరిగే తేదీలు, సమయాల్లోనే ఈ ఎగ్జామ్స్ ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఓపెన్ టెన్త్ పరీక్షలు ఈ నెల 28తో ముగియనున్నాయి. మొత్తం 30,334 మంది కోసం 471 సెంటర్లను ఏర్పాటు చేశారు.
Similar News
News March 17, 2025
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గొప్పతనం ఇదే..

TG రాజకీయ, సాంఘిక చైతన్యానికి మరోపేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, పండితుడు, రచయిత, నిజాం వ్యతిరేక ఉద్యమ నేతగా ఆయన సుపరిచితుడు. ‘నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము’ అన్న నిందను సవాల్‌గా తీసుకొని 354 కవులతో ‘గోల్కొండ కవుల సంచిక’ గ్రంథం ప్రచురించారు. గోల్కొండ పత్రికనూ నడిపారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషాలు, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు వంటి పుస్తకాలు రాశారు.
News March 17, 2025
తెలుగువారి చరిత్రను తెలుగువారికి చాటిన సురవరం

ఆంధ్రము అంటే తెలుగు. ఆంధ్రులు అంటే తెలుగువారు. మన చరిత్రను మనకు తెలిపిన, ప్రపంచానికి చాటిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ మన గొప్పేంటో, తప్పేంటో వివరించింది. ఆంధ్రుల సంస్కృతి, రాజులు, పంటలు, పండుగలు, కవులు, యాసలు, భాష, వేషం గురించి ఇందులో తెలుసుకోవచ్చు. ముక్కుపుల్ల, అష్టాచెమ్మ, గుజ్జనగూళ్లు సహా మన పూర్వీకుల బాల్యపు ఆటల గురించి తెలిస్తే అమ్మో అనాల్సిందే. SHARE.
News March 17, 2025
పొట్టిశ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఆమోదం

TG: పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.