News March 17, 2025
కాకినాడ: మానవత్వం మరిచి తల్లిని హత్య చేసిన కొడుకు

నేటి సమాజంలో మానవత్వం మంట కలుస్తోంది. తల్లిని హత్య చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ రూరల్ ఎస్.అచ్యుతాపురానికి చెందిన జహీరా బీబీ (55)పై చిన్న వివాదంతో ఆదివారం ఆమె కొడుకు షబ్బీర్ కమల్ దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనా స్థలానికి రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఇంద్రపాలం ఎస్సై వీరబాబు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 17, 2025
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

శ్రీ సత్య సాయి జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. పుట్టపర్తి అర్బన్ పరిధిలోని ఎనుములపల్లి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సందర్శించి భద్రత ఏర్పాట్లు క్షుణ్ణంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, కేంద్రాలలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలన్నారు.
News March 17, 2025
ప్రజా సమస్యల అర్జీలను స్వీకరించిన కలెక్టర్

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, విజయ్ కుమార్, పీడీ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
News March 17, 2025
తెలుగువారి చరిత్రను తెలుగువారికి చాటిన సురవరం

ఆంధ్రము అంటే తెలుగు. ఆంధ్రులు అంటే తెలుగువారు. మన చరిత్రను మనకు తెలిపిన, ప్రపంచానికి చాటిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ మన గొప్పేంటో, తప్పేంటో వివరించింది. ఆంధ్రుల సంస్కృతి, రాజులు, పంటలు, పండుగలు, కవులు, యాసలు, భాష, వేషం గురించి ఇందులో తెలుసుకోవచ్చు. ముక్కుపుల్ల, అష్టాచెమ్మ, గుజ్జనగూళ్లు సహా మన పూర్వీకుల బాల్యపు ఆటల గురించి తెలిస్తే అమ్మో అనాల్సిందే. SHARE.