News March 17, 2025

HYD: ఓయూ బంద్‌కు ABVP పిలుపు

image

ఓయూలో‌ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు ఇక మీదట అనుమతి లేదని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది నియంతృత్వ పోకడ అంటూ ABVP మండిపడుతోంది. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నేడు ఉస్మానియా యూనివర్సిటీ బంద్‌కు నాయకులు పిలుపునిచ్చారు. రిక్రూట్‌మెంట్, నిధుల కొరత, ఆహార నాణ్యత అంశాలపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారనే నెపంతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.

Similar News

News September 19, 2025

22 నుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మకు పల్లకి, పవళింపు సేవ

image

దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయంలో ఏర్పాటు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉ.3 గంటలకు పెద్దమ్మ తల్లికి అభిషేకం చేస్తారు. ప్రతిరోజు రాత్రి అమ్మవారి ఉత్సవమూర్తికి పల్లకి, పవళింపు సేవ చేయనున్నారు.

News September 19, 2025

HYDలో వర్షపాతం వివరాలు ఇలా!

image

HYDలో నిన్న పలుచోట్ల వర్షం పడింది. వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. బహదూర్‌పురాలో 9.1 CM, నాంపల్లిలో 8, చార్మినార్‌లో 7.8, కాప్రాలో 6.2, ఖైరతాబాద్‌లో 5.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న చాలా చోట్ల సాయంత్రం 2 గంటల పాటు వర్షం కురిసింది. అర్ధరాత్రి దాటాక మరోసారి దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు, పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి.

News September 19, 2025

HYD: ‘అయ్యా..! మా కడుపుమీద కొట్టకండి

image

HYD, రంగారెడ్డి జిల్లాలోని పేదల రేషన్‌కార్డులు కట్ చేశారని మండిపడుతున్నారు. సమాచారం ఇవ్వకుండా తమ కడుపుమీద కొట్టారని వాపోతున్నారు. డీలర్ల వద్ద సమాచారం లేదని, అధికారులను అడగాలంటున్నారని వాపోయారు. వ్యవస్థ మీద అవగాహనలేనివారి పరిస్థితి ఏంటని ప్రశిస్తున్నారు. కొందరు మండలాఫీసులో సంప్రదిస్తే అధికారులకే కారణం తెలియడంలేదని వాపోతున్నారు. తమ కార్డలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. మీ కార్డూ రద్దైందా?