News March 17, 2025

HYD: ఓయూ బంద్‌కు ABVP పిలుపు

image

ఓయూలో‌ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు ఇక మీదట అనుమతి లేదని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది నియంతృత్వ పోకడ అంటూ ABVP మండిపడుతోంది. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నేడు ఉస్మానియా యూనివర్సిటీ బంద్‌కు నాయకులు పిలుపునిచ్చారు. రిక్రూట్‌మెంట్, నిధుల కొరత, ఆహార నాణ్యత అంశాలపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారనే నెపంతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.

Similar News

News March 2, 2026

అర్జీలు స్వీకరించనున్న పల్నాడు కలెక్టర్

image

పల్నాడు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడంతో పాటు, ఇంటి నుంచే సేవలను వినియోగించుకోవచ్చన్నారు. 1100 నంబర్ కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

News March 2, 2026

గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు రద్దు

image

గల్ఫ్ యుద్ధంతో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. UAE, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతర్‌‌కు అన్ని ఫ్లైట్స్, ఐరోపా దేశాలకు వెళ్లే 6 విమానాలను ఈరోజు రాత్రి 11.59 గంటల వరకు రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. దుబాయ్, షార్జా విమాన సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు స్పైస్ జెట్ తెలిపింది. అటు దుబాయ్, సౌదీ, కువైట్‌‌ ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News March 2, 2026

పాలమూరులో వ్యక్తి దారుణ హత్య!

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గౌరారం శివారులో ఆదివారం రాత్రి ఘోరం జరిగింది. కొల్లాపూర్ పట్టణానికి చెందిన జగన్(32) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.