News March 17, 2025

మంచిర్యాల: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

image

రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. నిరుద్యోగులు tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు ఐటీడీఏ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

Similar News

News March 17, 2025

పొట్టిశ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఆమోదం

image

TG: పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

News March 17, 2025

హాట్ టాపిక్‌గా కేటీఆర్, మల్లన్న భేటీ

image

కేటీఆర్, హరీశ్, తీన్మార్ మల్లన్న హైదరాబాద్‌లో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పు నిప్పులా ఉండే వీరి భేటీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న వారిని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారిన వీరి అనూహ్య భేటీపై మీ కామెంట్.

News March 17, 2025

అనకాపల్లి: రైళ్లు ఆలస్యం.. సమాచార కేంద్రం ఏర్పాటు

image

విజయరామరాజుపేట వద్ద రైల్వే వంతెన కుంగిన నేపథ్యంలో విజయవాడ-విశాఖపట్నం మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గోదావరి, విశాఖ, సింహాద్రి, అమరావతి, గరీబ్‌రథ్‌, మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు విశాఖ చేరుకోవడం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వేస్టేషన్‌లో సమాచార కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 08912746330, 08912744619 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

error: Content is protected !!