News March 17, 2025
టెన్త్ విద్యార్థులకు ఫ్రీ బస్

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో విశాఖ జిల్లాలోని విద్యార్థులందరినీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం 7 డిపోల నుంచి 150 బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా సమయానికి ముందు, ముగిసిన తర్వాత 2.30 గంటల వరకు బస్సులు షెడ్యూల్, స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హాల్ టికెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.
Similar News
News January 12, 2026
విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి

విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. విశాఖ నూతన జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి రానున్నారు. ఆమె గతంలో చిత్తూరు జిల్లా జేసీగా పనిచేశారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
News January 12, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు పీజీఆర్‌ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.