News March 17, 2025
టూరిజం స్పాట్‌గా పల్నాడు జిల్లా

జిల్లాల పునర్విభజనలో పలు కీలక ప్రాంతాలు పల్నాడు జిల్లా పరిధి లోనికి రావటంతో పల్నాడు టూరిజం హబ్‌గా అభివృద్ధి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. నాగార్జునసాగర్, ఎత్తిపోతల, పులిచింతల, అమరావతి, కొండవీడు, కోటప్పకొండ, గుత్తికొండ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తాయి. పల్నాడు కృష్ణానది పరివాహక ప్రాంతం కావడంతో టూరిజం స్పాట్ గా అభివృద్ధి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
Similar News
News January 3, 2026
నేటి ముఖ్యాంశాలు

* ‘ఉపాధి’ పథకానికి గాంధీ పేరు పునరుద్ధరించాలంటూ TG అసెంబ్లీలో తీర్మానం
* రూ.7వేల Crతో HYDకు గోదావరి జలాలు: CM రేవంత్
* పాసుపుస్తకాల పంపిణీతో ఇళ్లల్లో సంతోషం: CM CBN
* ఫోర్బ్స్ డేటా.. FY-2026లో పెట్టుబడుల్లో AP టాప్
* కూటమి దౌర్జన్యాలను తిప్పికొడతాం: YS జగన్
* తొలిరోజే అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన BRS
* KCR సభకు రాకపోతే BRSను భగవంతుడు కూడా కాపాడలేడన్న కవిత
News January 3, 2026
ఆస్ట్రోనాట్స్‌కు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తీసేస్తారు

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తొలగిస్తారట. సాధారణంగా వీటితో సమస్యలుండవు. కానీ ఇబ్బంది వస్తే త్వరగా తొలగించాలి. అందుకే.. అంతరిక్షంలో ఉండగా వీటి సమస్య వస్తే కష్టమని ముందే ఆపరేషన్ చేస్తారట. ఇటీవలే స్పేస్‌లోకి వెళ్లొచ్చిన శుభాంశు శుక్లా ఈ విషయం వెల్లడించారు. సెల్ఫ్ ట్రీట్మెంట్‌పై ట్రైనింగ్ ఇస్తారని, ఆపరేషన్లు లాంటివి మాత్రం అక్కడి జీరో గ్రావిటీలో చేసుకోలేమన్నారు.
News January 3, 2026
సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాల వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ నాగర్జున

రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ గా డాక్టర్ నాగార్జున చక్రవర్తి నియామకమయ్యారు. వైద్య కళాశాల ప్రొఫెసర్ హెచ్‌ఓడీ అనస్థీషియా డిపార్ట్మెంట్ డాక్టర్ నాగార్జున చక్రవర్తిని రాష్ట్ర డీఎంఈ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరీ వైస్ ప్రిన్సిపల్‌గా (అడ్మినిస్ట్రేటివ్ విభాగం ) నియమించారు.


