News March 17, 2025

అనంతపురం: వివాహితపై అత్యాచారయత్నం

image

నార్పల సుల్తాన్ పేట కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అదే కాలనీలో ఉండే లక్ష్మణ్ అనే వ్యక్తి కవిత అనే వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకుని, ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. కవితను లక్ష్మణ్ వేధించేవాడని, అతడే చంపి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కైలుట్లయ్య తెలిపారు.

Similar News

News August 10, 2025

రాగులపాడు పంప్ హౌస్‌లో 10 మోటార్లతో నీటి పంపింగ్

image

వజ్రకరూరు మండలం రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 10 మోటార్ల ద్వారా శనివారం నీటిని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలోకి పంపింగ్ చేశారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి రాగులపాడు పంప్ హౌస్ నుంచి 10 మోటార్లతో నీటి పంపింగ్ చేసేలా చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబుకు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలిపారు. హంద్రీనీవా కాలువలో పుష్కలంగా నీరు వస్తోందని, ఇందుకు చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు.

News August 9, 2025

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఈ నంబర్లకు ఫోన్ చేయండి: ఎస్పీ

image

ఎక్కడైనా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే డయల్ 100/112 లేదా సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. అనంతపురం జిల్లాలోని వాహనదారులు అధిక శబ్దంతో కూడిన స్పీకర్లు, సైలెన్సర్లు ఉపయోగించి అధిక వేగంగా వెళ్లరాదన్నారు. బైక్‌పై త్రిబుల్ రైడింగ్ చేయరాదని, ఆటోలో పరిమితికి మించి ప్రయాణీకులను తీసుకెళ్లరాదన్నారు. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడరాదన్నారు.

News August 9, 2025

అనంత జిల్లాలో 746 కేసులు నమోదు

image

అనంతపురం జిల్లాలో 76 ఓపెన్ డ్రింకింగ్, 44 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై 626 ఎంవీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. రూ.2,27,046 జరిమానాలు విధించామన్నారు. 42 పోలీసు స్టేషన్ల పరిధిలో అక్కడి పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌ నిర్వహించి, వాహనాల తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.