News March 17, 2025

పార్వతీపురం జిల్లా ప్రజలకు హెచ్చరిక

image

పార్వతీపురం మన్యం జల్లాలో మంగళవారం, బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బలిజిపేట, భామిని, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మిపురం, జియమ్మవలస, కొమరాడ, కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట , సీతనగరం, వీరఘట్టం మండల్లో 40 డిగ్రీల నమోదు అవ్వొచ్చని పేర్కొంది. వడగాల్పులు సైతం వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News September 17, 2025

16 ఏళ్ల నాటి పోరాటం గుర్తుచేసుకున్న MLC కవిత

image

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో, 2009లో వ్యవసాయ విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన తెలంగాణ విలీన దినోత్సవం వేడుకల జ్ఞాపకాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ‘X’ ఖాతాలో పంచుకున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రధాన కేంద్రంగా ఉన్న రోజులవి. ఆనాటి పోరాట స్ఫూర్తిని, యువతలో ఉన్న ఉత్సాహాన్ని మరోసారి ఆమె గుర్తుచేశారు.

News September 17, 2025

మరో 3 గంటలు భారీ వర్షం.. జాగ్రత్త!

image

TG: హైదరాబాద్‌లో <<17744168>>వర్షం<<>> దంచికొడుతోంది. మరో 3 గంటలు వాన కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అటు రాబోయే 2-3 గంటల్లో ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, యాదాద్రి, NZB, సూర్యాపేట, HNK, మేడ్చల్, ఉమ్మడి మెదక్ తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

News September 17, 2025

పోడు భూములకు రుణాలివ్వండి: కామారెడ్డి కలెక్టర్‌

image

అర్హులైన రైతులకు, పోడు భూములకు పంట రుణాలు వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశీష్‌ సాంగ్వాన్‌ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. అనంతరం ‘స్వచ్ఛత హీ సేవ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.