News March 17, 2025
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

AP: రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో మంత్రులు భేటీ కానున్నారు. సీఆర్‌డీఏ ఆమోదించిన రూ.37,702 కోట్ల టెండర్ల పనులను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. అదే విధంగా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు 4వ సమావేశంలో ఆమోదించిన అంశాలపైనా చర్చించి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
Similar News
News March 17, 2025
200 ఏళ్లనాటి పనస చెట్టును చూశారా?

TNలోని కడలూరులో పన్రుటి ప్రాంతం పనస పెంపకానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 4వేల మందికిపైగా రైతులు 800 హెక్టార్లలో వీటిని పండిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 200 ఏళ్లనాటి పనస వృక్షం ఫొటోను ఓ ఫారెస్ట్ అధికారి షేర్ చేస్తూ ఇది ఏటా 200 పండ్లు అందిస్తోందని తెలిపారు. కాగా, ఫైబర్, ఖనిజాలతో కూడిన పోషకాహారాలు పనస పండులో మెండుగా ఉండటంతో వీటి పెంపకానికి తమిళనాడు ప్రభుత్వం ‘జాక్‌ఫ్రూట్ మిషన్’ను ప్రారంభించింది.
News March 17, 2025
‘రాజీవ్ యువవికాసం’ ప్రారంభం

TG: ‘రాజీవ్ యువవికాసం’ పథకాన్ని CM రేవంత్ ప్రారంభించారు. ఇందులో భాగంగా SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి రూ.6వేల కోట్ల రుణాలను 60-80% వరకు రాయితీతో ఇవ్వనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.4లక్షల వరకు మంజూరు కానుంది. దీని కోసం APR 5 వరకు దరఖాస్తుల స్వీకరణ, APR 6- మే 31 వరకు పరిశీలన చేయనున్నారు. జూన్ 2న రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది.
News March 17, 2025
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

☛ చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్
☛ టీచర్ల బదిలీల నియంత్రణ చట్టసవరణ బిల్లుకు ఆమోదం
☛ అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం
☛ రాజధాని భూకేటాయింపులపై క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
☛ YSR తాడిగడప మున్సిపాలిటీ పేరు తాడిగడపగా మార్పు
☛ నంబూరులోని VVITకి ప్రైవేట్ వర్సిటీ హోదా